టాలీవుడ్ ఇండస్ట్రీ పంథా మార్చింది. కొత్త సినిమా ట్రైలర్లను విడుదల చేయాలంటే మారు పేరుతో విడుదల చేసి కావాల్సినంత పబ్లిసిటీని పొందుతున్నారు. గతంలో బాలకృష్ణ - డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్టన్ లో పైసా వసూల్ అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేస్తూ..దాన్ని ట్రైలర్ అని పిలవకుండా స్టంపర్ అనే పేరుతో విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ - వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ టీజర్‌ని ఫస్ట్ ఇంపాక్ట్ అనే టైటిల్‌తో విడుదల చేసి మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాడు. ఇప్పుడు వీరి బాటలో ప్రిన్స్ మహేష్ బాబు వచ్చి చేరాడు. ప్రస్తుతం మహేష్ బాబు - కొరటలా దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను జనవరి 26న విడుదల చేస్తున్నట్లుగా ‘ఫస్ట్ ఓత్’ అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చారు. ‘ఫస్ట్ ఓత్’ అనేది ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఆ రోజు విడుదల చేస్తున్నామని చెప్పడానికి వారు ‘ఫస్ట్ ఓత్’ అనే కొత్త పదాన్ని వాడారు. ఈ సినిమాకి రిలేటెడ్‌గా ఉన్న ఈ ఓత్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ.., ‘ఫస్ట్ ఓత్’ అంటూ వారు విడుదల చేసిన పోస్టర్‌కి మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.