ఉరేసుకున్న ప్రేమికులు...కలకలం సృష్టిస్తున్న మృతదేహాలు

Update: 2018-06-28 07:01 GMT

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై రెండు ఆస్తిపంజరాలను పోలీసులు గుర్తించారు. ఆధారాలను బట్టి వీరు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పెద్దండి ప్రశాంత్‌, గౌతమిగా నిర్ధారించారు. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవటంతో వీరిద్దరూ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రశాంత్, గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లి జరిపించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా గౌతమికి మరొకరితో వివాహం నిశ్చయించారు. విడిపోయి జీవించడం కన్నా చనిపోవడం మంచిందని ప్రేమికులు భావించారు. దీంతో పెళ్లికి ఐదురోజుల ఉందనగా గౌతమి ఇంట్లో నుంచి పారిపోయింది. ఇద్దరూ కలిసి కోడిమ్యాల చేరుకుని ముందుగా అనుకున్న ప్రకారం విషం తాగారు. అది పనిచేయకపోవడంతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ నాగేందర్‌, ఎస్‌ఐ సతీష్ అక్కడికి చేరుకుని కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Similar News