కర్నూలు టీడీపీ నేతలతో బాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక గురించి చర్చ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కర్నూలు జిల్లా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక గురించి చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి గత నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో ఇప్పటికే ఓ దఫా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇంచార్జి మంత్రి తదితరులు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. కాగా ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో జరుగుతున్న భేటీలో అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.