నోటి దుర్వాస‌న‌ను త‌రిమికొట్టాలంటే

Update: 2018-01-14 21:44 GMT

నేటి యాంత్రిక జీవితంతో పోటీ ప‌డేవాళ్లంద‌రు నోటి దుర్వాస‌నతో కృంగిపోతుంటారు. అది పెద్ద విష‌య‌మేమి కాక‌పోయినా..ప్ర‌మాదాన్ని కొని తెచ్చుపెడుతుంది. మ‌నం ఎవ‌రితో మాట్లాడాల‌న్నా..మ‌న‌నోటి నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌తో స‌రిగ్గా మాట్లాడ‌లేక ఆత్మ‌నూన్య‌త‌కు లోన‌వుతుంటాం. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నోటి దుర్వాస‌న‌ను దూరం చేసుకోవ‌చ్చు. 
ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి
కొంత‌మందికి ఉద‌యాన్నిబ్రష్ చేసిన త‌రువాత నాలుకను క్లీన్ చేసుకోరు. దీంతో రోజంత తిన్న ఆహార పదార్ధాలు నాలుక పై పేరుకుపోయి నోరు దుర్వాసన వస్తుంది. రాత్రి పుట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందుచేత నాలుకను శుబ్ర పరచడం తప్పనిసరి.
ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినండి.
ఆపిల్ మ‌నం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహ‌దం చేస్తుంది. అలాగే మ‌న నోటి నుంచి వ‌చ్చే దుర్వ‌స‌న‌ని కూడా దూరం చేస్తుంది. ఆపిల్ లో ఉండే కార‌కాలు నోటీపై దాడి చేసి క్రిముల్ని అంతం చేస్తుంది. దీంతో నోటి దుర్వాస‌న దూరం అవుతుంది. 
గ్రీన్ టీ 
గ్రీన్ టీ వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉన్న బెల్లీ ప్యాన్ ను క్లీన్ చేస్తుంది. దీంతో స్లిమ్ గా త‌యార‌వ‌వ‌చ్చు. అంతేకాదు నోటీ దూర్వాస‌ను దూరం చేస్తుంది. అందుకే ప్ర‌తీ ఒక్క‌రు గ్రీన్ తాగండి. 
కొబ్బరి నునె
కొబ్బ‌రినూనెతో మ‌న‌కు అనేక లాభాలు ఉన్నాయి. పెద్ద‌వాళ్లు శ్వాస కోస సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటే కొబ్బ‌రి నూనెను నోట్లో వేసుకొని పోక్కిలించడం వలన నోట్లోని హనికారక బాక్టీరియా నిర్ములించబడి, పళ్ళ చిగుల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాలతో మీ శ్వాస ని తాజా గ చేసుకోండి.    
 

Similar News