కేసీఆర్‌ ప్రయోజనాలకే ఫెడరల్‌ ఫ్రంట్‌: లక్ష్మణ్‌

Update: 2018-12-26 12:17 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేత లక్ష్మణ్‌. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలో హడవుడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రాపాలనను గాలికివదిలేసి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడి ఈరోజకి రెండువారాలకు ఎక్కువే అయితుంది ఇప్పటివరకు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకకుండా రాష్ట్రాలపంటి తిరగడం సరికాదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ నిన్న విడుదల చేసిన రిజర్వేషన్ల జాబితాపై మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లశాతాన్ని కుదించడం అన్యాయమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండ ప్రజలు మోడీకే ఓటు వేస్తారని ధీమావ్యక్తం చేశారు.

Similar News