భారీ మెజార్టీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. సుమారు 15 వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. భద్రతా కారణాలతో 12 గంటల వరకే కార్యకర్తలను లోపలికి అనుమతించారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్ననేపధ్యంలో భారీ మెజార్టీ లక్ష్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల 14న నామినేషన్ వేయనుండంతో జన సమీకరణ ఇతర అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.