ఆ విషయంలో నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది : కత్తి మహేష్

Update: 2017-12-12 05:57 GMT

నిత్యం ఏదో ఒక దానిపై తన  భావాన్ని వ్యక్తపరుస్తూ రాజకీయనాకులు , సినీ దిగ్గజాలపై మండిపడుతుంటారు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి ఘాటు విమర్శలు చేసారు అయన ఏమి మాట్లాడారో అయన మాటల్లోనే చూడండి " మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్." అని అన్నారు..

అంతేకాదు "చిరంజీవి సామాజిక న్యాయం అంటే నమ్మాము. మోసం చేసి పోయాడు. రాజకీయంగా కాపులను, బహుజనులు, దళితులను, మైనారిటీలను ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్. నాకు కులం లేదు అంటున్నావ్. ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నదే కులం. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం.అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే NGO పెట్టుకో...రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాడు. రియాలిటీ గ్రహించి మాట్లాడు. అంతేకాదు తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ఈ విశ్వ మానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదు ? " అంటూ పవన్ పై మరోసారి తన బాణాలను ఎక్కుపెట్టాడు.. కత్తి మహేష్ 

Similar News