సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్. కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుతమ్ముళ్ల ఆందోళన దిగిన విషయం తెలిసిందే అయితే ఈ చిత్రం ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ తాను చూసానని అది పరమ చెత్తగా ఉందని కత్తి మహేష్ పెర్కోన్నారు. అసలు ఆ సినిమాలో అరుపులు, కేకలు తప్ప మరేవి లేవని స్పష్టం చేశారు కత్తి మహేశ్. అసలు అనవసరంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమా విషయంలో టీడీపీ నేతలు ఎంత సైలెంటుగా ఉంటే అంత మంచిదని కత్తిమహేశ్ సూచించారు. అసలు ఈ సినిమా రెండు మూడ్రోజుల కంటే ఎక్కువ నడవదని కత్తిమహేష్ ఎద్దేవ చేశారు.