కత్తిమహేష్ కు -పవన్ కల్యాణ్ కు మధ్య జరుగుతున్న వివాదం ముగిసినట్లేనని తెలుస్తోంది. తనపై కోడిగుడ్లతో దాడిచేసినందుకు పవన్ అభిమానులపై కత్తిమహేష్ కేసు పెట్టారు. అయితే ఆ కేసును ఉపసంహరించుకున్నట్లు, కత్తి - పవన్ కల్యాణ్ అభిమానులు కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కత్తి మహేష్ కేసును ఉపసంహరించుకున్నారనే విషయం తెలుసుకున్న రైటర్ కోన వెంకట్ , కత్తిమహేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు - మహేష్ కత్తి ఫోటోలు కలిసి ఉన్న ఓ ఫోటోను కోన షేర్ చేశారు. నీ కెరియర్ బాగుండాలి. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే వారు పవన్‌కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అంటూ కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో కత్తి మహేష్ తాజాగా మరో ట్వీట్ చేశారు.
"పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను."