పవన్ కల్యాణ్ - కత్తిమహేష్ ల వివాదం ముగిసిని విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా కత్తి మహేష్ - పవన్ కల్యాణ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కత్తి మహేష్ ఓ ఛానల్ ఇంటర్వ్యూకి వెళుతుండగా మాదాపూర్ టవర్స్ నుండి శిల్పారామం మధ్యలో తన కారును అడ్డగించి కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిపై కత్తిమహేష్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు తనపై దాడికి పాల్పడింది పవన్ కల్యాణ్ ఫ్యాన్సేనని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం మరో లైవ్ డిబెట్లో పాల్గొన్న కత్తిమహేష్ పవన్ కల్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ అఫైర్లు అన్నీ తనకు తెలుసునని పలు ప్రశ్నలు సంధించాడు.
కాగా కత్తిమహేష్ తనపై దాడికి పాల్పడినందుకు మాదాపూర్ పీఎస్ లో పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నాడు. ఈ సందర్భంగా పవన్ అభిమానుల్లా కాకుండా జనసేన కార్యకర్తలుగా పనిచేయాలని సూచించారు. ఇకపై పవన్ అభిమానులు రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసినా తాను సంయమనం పాటిస్తానని చెప్పాడు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్త దిలీప్ కల్యాణ్ సుంకరతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్న ఫోటోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ వివాదాన్ని మెగా బ్రదర్ నాగబాబు పరిష్కరించినట్లు తెలుస్తోంది. చిరు తమ్ముడు నాగేంద్రబాబు చొరవతోనే వివాదం ముగిసిందని జనసేన నాయకుడు కల్యాణ్ సుంకర ఓ టీవీ ఛానల్ చర్చలో చెప్పారు. ‘ఈ అనవసర వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని పవన్ అభిమానులకు నచ్చజెప్పారు. నాగబాబు ఆలోచన , కత్తిమహేశ్ పెద్ద మనసు వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
దీంతో మెగా బ్రదర్ పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐ లవ్యూ డాడీ (జబర్దస్త్ టీం అన్నట్లుగా) మీ వల్లే ఈ సమస్య పరిష్కారం అయ్యిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.