టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కె. కేశవరావుపై చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఎంమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. వెంకటేశ్‌ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. టీజీ వెంకటేశ్ కామెంట్ల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలలని సీఎం చంద్రబాబుకి సూచించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచవద్దని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు.