కర్ణాటక రాజకీయలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్పకు ఆ ఆనందం ఒకరోజు కూడా నిలవలేదు.. సుప్రీంకోర్టు కర్ణాటక అసెంబ్లీ వేదికగా శనివారం సాయంత్రం 4గంటలకు బలపరీక్షకు ఆదేశించింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 221 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఏ పార్టీ అయినా ప్రభుత్వం చేపట్టాలంటే..111 మంది ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బిజెపికి104 స్థానాలుండగా ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ కూడా బిజెపి వైపు చేరినట్లు తెలుస్తోంది.. దాంతో బిజెపి బలం 106కు చేరుకుంది.. ఇక కాంగ్రెస్ కు 76 , జేడిఎస్ కు 37 స్థానాలున్నాయి.. ఇద్దరు ఇండిపెండెంట్లు ఈ కూటమి వెంట ఉండటంతో కుమారస్వామి టీమ్ మొత్తం బలం115 కు చేరుకుంది.. శనివారం నాడు జరిగే హై ఓల్టెజ్ బలనిరూపణ టెస్టు నాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ గూటినుంచి ఆగూటికి మారతారో తెలియదు..