దాచేపల్లి అత్యాచార ఘటన మరువకముందే..కడప జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముళ్లపొదల్లోకి ఎత్తుకెళ్లి రేప్ చేశారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందిుతుల్ని అరెస్ట్ చేశారు. బాధిత బాలికను చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లా బద్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థులు రమేష్, కృష్ణ అత్యాచారానికి పాల్పడ్డారు. ముళ్లపొదల్లోకి ఆ బాలికను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. జరిగిన అఘాయిత్యంపై బాధుతురాలు తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం గాలించిన పోలీసులు కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు.