జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతిపురాతనమైన వెంకటేశ్వర ఆలయంలో వింత చోటు చేసుకుంది. గుడిలోకి ఓ గురుడ పక్షి వచ్చింది. గరుత్మంతుడి విగ్రహం పాదాల చెంత గరుడపక్షి నిలిచింది. శ్వేతవర్ణంలో ఉన్న పక్షికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు సైతం చేశారు. ఇటు విషయం తెలుసుకున్న భక్తులు హుటాహుటానా ఆలయంకి చేరుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గరుడపక్షిని దర్శించుకుంటున్నారు.