టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ తో జరిగిన నాల్గవ వన్డేలో విజయం సాధించి వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగుకు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. వన్‌సైడ్‌గా ముగిసిన చివరి మ్యాచ్‌లో విండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పావెల్ , హోప్ డకౌటవగా… హెట్‌మెయిర్ 9 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ హోల్డర్ చేసిన 25 పరుగులే విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. భారత బౌలర్లలో జడేజా 4 , బూమ్రా 2, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ( 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి ( 33 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు మరోసారి బ్యాట్ ఝళిపించారు. ఓపెనర్ శిఖర్ ధావన్(6) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లిల భారత్‌కు విజయాన్ని అందించింది.