ఆసియాకప్‌లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయం నమోదుచేసిన భారత్ తాజాగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. వన్‌సైడ్‌గా మారిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. జడేజా(4/29) దెబ్బకు పాక్ జట్టు కకావికలమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్ మిరాజ్ (50 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగుకూ దిగిన భారత్ 36.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి సూపర్ విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్ గా నిలిచాడు. శిఖర్ ధావన్ (47 బంతుల్లో 40 , ధోని 37 బంతుల్లో 33 రాణించడంతో భారత్ విజయం ఖరారైంది. ఇక రేపు(ఆదివారం) పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.