రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తు చేయగా.. ఈ మ్యాచ్ సందర్బంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెహ్వాగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ బౌలర్ దేవేంద్ర బిషూ బౌలింగ్ లో ఫోర్ కొట్టి టెస్టుల్లో 24 వ సెంచరీని సాధించాడు. దాంతో ఇప్పటివరకు 23 సెంచరీలతో ముందువరుసలో ఉన్న సెహ్వాగ్ ను కిందకి నెట్టాడు. అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్(51) అగ్రస్థానంలో ఉండగా. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గవాస్కర్ (34)లు ఉన్నారు. నాల్గవ స్థానంలో కోహ్లీ(24), ఐదవ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్(23) ఉన్నారు. ఇదిలావుంటే 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా.. 103 టెస్టుల్లో సెహ్వాగ్ 23 సెంచరీలు చేశాడు. సెహ్వాగ్ ఇందులో దాదాపు 20 సెంచరీలు తక్కువ బాల్స్ కె కొట్టడం విశేషం.