రాజ్‌కోట్ టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ

Update: 2018-10-06 10:38 GMT

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తు చేసి 1-0 తో ముందంజలో వుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా  తొలి ఇన్నింగ్స్‌లో 649 పరుగులు చేయగా… పృథ్వీషా, కోహ్లీ, జడేజా సెంచరీలతో అదరగొట్టారు.  ఇక మొదటి  ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలిన విండీస్.. ఫాలోఆన్‌లోనూ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌ ఏ దశలోనూ కరేబియన్ టీమ్ కోహ్లీసేనకు పోటీ ఇవ్వలేకపోయింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌యాదవ్, అశ్విన్ ధాటికి కిరణ్‌ పావెల్ 83 పరుగులు తప్పిస్తే… మిగిలిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో  ఇన్నింగ్స్ లో విండీస్ జట్టు 196 పరుగులకు కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అశ్విన్… రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లతో భారత్ గెలుపునకు  శుభారంభాన్ని ఇచ్చాడు. రెండో టెస్ట్ అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.

Similar News