ఆసియా కప్ టోర్నీలో భారత్.. దాయాధి పాక్ ను చిత్తు చేసింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది.ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (90 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ సర్ఫరాజ్ (66 బంతుల్లో 44; 2 ఫోర్లు) రాణించాడు. బుమ్రా, కుల్దీప్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 238 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శిఖర్ ధావన్ (100 బంతుల్లో 114; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ రోహిత్ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. 114 పరుగులు చేసిన ధావన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ధావన్ , రోహిత్ లు కలిసి తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి గెలుపును సునాయాసం చేశారు. ఇక చివరి సూపర్–4 మ్యాచ్‌లో భారత్ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.