సిడ్నీ టీ20 లో మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్నందుకుంది. దీంతో 1-1 తో సిరీస్ సమం అయింది. ముందుగా బ్యాటింగుకు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. షార్ట్ 33 , ఫించ్ 28 పరుగులు చేయగా.. భారత్ బౌలింగ్, కృనల్ పాండ్య 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ 61(నాటౌట్), శిఖర్ ధావన్ 41, రోహిత్ శర్మ 23 , దినేష్ కార్తీక్ 22(నాటౌట్)రాణించారు. ఆస్ట్రేలియా బౌలింగ్ స్టార్క్, ఆడమ్ జంపా, మ్యక్సవెల్ , టై, లు నలుగురు తలో వికెట్ తీశారు. కాగా మొదటి టీ20 లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో టీ20 మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాజగా మూడో టీ20లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ సమం అయింది.