ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ లను బదిలీచేసింది. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేసిన అధికారులకు స్థానచలనం కలిగింది. కడప , విజయనగరం కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది అలాగే అనంతపురం పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లను బదిలీచేసింది. సంక్షేమ పథకాల అమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే వారిపై బదిలీవేటు వేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న బీసీ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్ ఎండీలతో పాటు... రాజమండ్రి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది.