హుషారు సినిమా .. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్..వెర్రెక్కి వున్నోలు అనే పాటకి సరిగ్గా సరిపోతుంది అనిపించింది. నూతన దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి తెరకెక్కించిన యువ నవ..కవ్వించే చిత్రం ఇది. సినిమాలో సగం చర్చ..రచ్చ..."మందు ముందు" అనే. ముఖ్యంగా బీర్..బీర్ అని తపించే యువత తపన గురించే అనిపిస్తుంది. మందులో కొంత ప్రేమ, స్నేహం మసాలా వేసి యువతకి అమ్మినట్టు వుంటుంది. ఎన్నో సీన్లో ఎవరో ఒకరి చేతిలో బీర్ కనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడు సినిమా ధియేటర్ నుండి చక్కగా బారుకి వెళ్ళేల గుప్పున ప్రభావితం చేస్తుంది. అసలీ సినిమాలో ఓ కీలక ఎపిసోడే బీర్ చుట్టూ తిరుగుతుంది. 'ఉండిపోరాదే' అనే సాంగ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షింస్తుంది. డబల్ మీనింగ్ డైలోగులు...మందు మద్య మంచింగ్ లా వస్తూనే వుంటాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ కథ పడకపోవచ్చు...కాని యువతకి మాత్రం...రచ్చ రచ్చె. యువత మనసులోని నీలి ఉహలని తెరమీద దించాడు శ్రీ హర్ష. రొటీన్ కథ ఈ చిత్రంలో మైనస్ అయిన.... ఈ చిత్రం యూత్ కు నచ్చే ఛాన్స్ వుంది. అలాగే మన రాహుల్ రామకృష్ణ తో నాటు నవ్వులు బాగానే పండించాడు... మొత్తానికి పెద్దల సినిమా కాదు...పిల్లల అదే వయస్సు వచ్చిన పిల్లల కథనే. శ్రీ.కో.