హెచ్‌ఎం టీవీ సాయంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు తల్లీబిడ్డలు. పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి నసీం ఉన్నిసా అనే నిండు గర్భిణీ వచ్చింది. డెలీవరికి ఇది సమయం కాదు, పైగా డాక్టర్ లేడంటూ ఆమెను ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న నసీంఉన్నిసాను హెచ్ ఎం టీవీ రిపోర్టర్ గమనించారు. వెంటనే ఆమెను ఆటోలో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. నసీం ఉన్నిసా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన హెచ్ ఎం టీవీకి రిపోర్టర్ కు నసీం ఉన్నిసా బంధువులు ధన్యవాదాలు తెలిపారు.