అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హన్స్ ఇండియా-హెచ్‌ఎంటీవీ నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాలకు మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌తో పాటు అమరావతి, విశాఖ, గుంటూరు నగరాల్లో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపులకు మహిళలు వెల్లువలా వచ్చి.. హెల్త్ చెకప్ చేయించుకున్నారు. స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే.. ఇంటితో పాటు సమాజం కూడా బాగుంటుందని హన్స్ ఇండియా-హెచ్ఎంటీవీ చేపట్టిన క్యాంపెయిన్‌ను ప్రతి ఒక్కరూ అభినందించారు.
మహిళల కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు తెలంగాణ CMO OSD.. IFS ప్రియాంక వర్గీస్. మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో నిర్వహించిన ఫ్రీ హెల్త్ క్యాంపును ఆమె ప్రారంభించారు. ఒకే రోజు 42 ఆస్పత్రుల్లో హన్స్ ఇండియా- హెచ్ఎంటీవీ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడం సంతోషమన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. ఇంట్లో పిల్లలు బాగుంటారన్నారు. సమాజంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించే మహిళలు.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రియాంక వర్గీస్. మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌కు మహిళలు తరలివచ్చారు. చాలా మంది గృహిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించిన హన్స్ ఇండియా-హెచ్ఎంటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మియాపూర్‌లోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రిలో మహిళలకు ఉచితంగా నేత్ర పరీక్షలు చేశారు. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. విశాఖలో 8 ప్రముఖ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా.. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మహిళల ఆరోగ్యం కోసం హన్స్ ఇండియా-హెచ్‌ఎంటీవీ ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని.. ప్రతి ఒక్కరూ అభినందించారు. గుంటూరు సిబర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెన్స్‌లో హెచ్ఎంటీవీ-హన్స్ ఇండియా ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్ నిర్వహించింది. ఈ వైద్యశిబిరంలో మహిళలు.. ఉచితంగా డెంటల్ చెకప్ చేయించుకున్నారు. ఇది మంచి కార్యక్రమం అని మహిళలు కొనియాడారు.
ఇటు విజయవాడలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి.. మంచి స్పందన వచ్చింది. మహిళలంతా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలోని అపెక్స్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మహిళలు భారీగా తరలివచ్చారు. వాళ్లందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు అపెక్స్ ఆస్పత్రి డాక్టర్లు. నాచారం ప్రసాద్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌కు మహిళలు భారీగా సంఖ్యలో వచ్చి చెకప్ చేయించుకున్నారు. స్థానిక కార్పొరేటర్ శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని.. వైద్యశిబిరాన్ని ప్రారంభించి.. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మహిళల కోసం ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంపై హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీని.. డాక్టర్ సుమా ప్రసాద్ అభినందించారు.