అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్

Update: 2018-06-08 13:23 GMT

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి.. త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, లీగల్‌ సర్వీస్‌ సెక్రటరీ ఉండాలని సూచించింది. త్రిసభ్య కమిటీతో కలిసి.. సీఐడీ ఆస్తులు వేలం వేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే తరహాలో..అన్ని జిల్లాల్లో ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగించాలని తెలిపింది న్యాయస్థానం. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తుల వేలానికి పబ్లిసిటీ ఇచ్చి.. 6 వారాల్లో వేలం పూర్తి చేయాలని చెప్పింది కోర్టు. తదుపరి విచారణ జూన్‌ 25కు వాయిదా వేసింది హైకోర్టు.
 

Similar News