రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్) ఖాతాలకు 8% వార్షిక వడ్డీని జమ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు 8% వార్షిక వడ్డీకి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగో అమలుచేస్తున్న పీఎఫ్ వడ్డీ రేట్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో 8% పీఎఫ్ వడ్డీని అమలుచేస్తోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి ఈ వడ్డీని జమ చేయనున్నట్లు రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.