గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.