తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విషాదం జరిగింది. నాలుగేళ్ళ చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున నీటి గుంటలో పడి మృతిచెందింది. రంపచోడవరం మండలం వలస ఆదివాసీ గ్రామం సున్నం మట్కాకు చెందిన మడకం కోసయ్య దేవీ దంపతులకు కుమార్తె జ్యోష్ణ ఉంది. పాప స్థానిక అంగనవాడి స్కూల్ లో చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో వీధిలోని పిల్లలతో కలిసి జ్యోష్ణ ఇంటికి సమీపంలో ఆడుకుంటోంది. వర్షపు నీటి నిల్వ కోసం అటవీ శాఖ తవ్వించిన గుంత కాలువ వద్దకు వెళ్లి అందులో రాయ వేస్తుండగా జ్యోష్ణ కాలుజారి నీటిలో పడి మునిగి పోయింది. మిగిలిన పిల్లలు భయంతో పరుగున వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు కాలువ వద్దకు వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది.