సుమన్‌ చరిత్ర బయటపెడతా: ఓదేలు

Update: 2018-09-13 05:53 GMT

బాల్క సుమన్ పై దాడికి తనకు సంబంధంలేదని టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్పష్టంచేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో చెన్నూర్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. సుమన్ జీవిత చరిత్రను కేసీఆర్ ముందు పెడతానని నల్లాల ఓదేలు తెలిపారు. నా వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్‌పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్‌ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్‌ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు. సుమన్‌ జీవిత చరిత్రను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందు బయట పెడతానని తెలిపారు. నన్ను మానసిక క్షోభకు గురిచేసేందుకే నాపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Similar News