పోకిరి సినిమా తరహాలో ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కొనకొనమిట్ల మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన షబ్బీర్ హోంగార్డుగా ఉన్నాడు. గత కొద్ది కాలంగా విధులకు దూరంగా ఉన్న షబ్బీర్ స్ధానికంగా ఉన్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి గ్రామంలో ఓ కోళ్ల ఫారం నడుపుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో సన్నిహితంగా ఉన్న సమయంలో చేతులు, కాళ్లను గోలుసులతో కట్టేసి పెట్రోల్ పోసీ తగులబెట్టింది. ఈ ఘటనలో షబ్బీర్ అక్కడికక్కడే చనిపోగా .. జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ప్రియురాలు పోలీసులకు లొంగిపోయింది. మృతుడు షబ్బీర్‌కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయని పోలీసులు తెలియజేశారు.