చాలా కాలం తరువాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉన్న విజయశాంతి..రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా ఉద్యమసమయంలో తనకు ఎదురైన సవాళ్లు, తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారో,
జయలలిత కు మద్దతు తనని ఎవరు చంపాలనుకున్నారో అన్నీ తనకు తెలుసంటూ ఆ నాటి పరిస్థితుల్ని వివరించారు.
ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ వేరు..ఇప్పుడున్న కేసీఆర్ వేరని తేల్చిచెప్పారు. జయశంకర్ సార్ చెప్పడం వల్లే తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. కానీ 2009లో నా సీటుకే కేసీఆర్ ఎసరు పెట్టారని, తీరా అందరూ చెప్పాక కేసీఆర్ మనసు మార్చుకున్నారని ఆనాటి పరిస్థితుల్ని వివరించారు. త్వరలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నానని రాములమ్మ ప్రకటించారు. ఇన్నాళ్లూ కావాలనే గ్యాప్ తీసుకున్నా..కానీ హైకమాండ్‌తో మాత్రం టచ్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్ గాంధీ తనన ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఈసారి నియోజకవర్గానికే పరిమితివ్వాలని లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. అది బస్సు యాత్రో..మరో యాత్ర తెలీదుగానీ..హైకమాండ్ చెప్పినట్లు చేస్తానని విజయశాంతి స్పష్టం చేశారు.
రాములమ్మకు ప్రజా సేవ చేయడం అంటే ఇష్టమేనని..అందుకోసం తానెప్పుడు సిద్ధమేనని ప్రకటించారు. అయితే తనకున్న సమాచారం మేరకు తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని సూచించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతపై గళం విప్పితే ప్రొఫెసర్ కోదండరాం ను జైల్లో పెడుతుందా ఈ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి పరిస్థితి ఎలాఉందో పవన్ రాజకీయ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని తెలిపారు. రాష్ట్రప్రజలు చాలా తెలివైన వాళ్లు. ఏ నేతకు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్లకు తెలసుని గుర్తు చేశారు.
నాటి రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు పలికిన నేతలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని...అలాంటి వారిని మంత్రులు గా తీసుకునేముందు ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేదని తెలిపారు. ఇది బంగారు తెలంగాణగా కనబడటం లేదు. ఇత్తడి తెలంగాణగా కనపడుతోంది. ఉద్యమంలోని కేసీఆర్ వేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఉన్న కేసీఆర్ వేరు` అని అన్నారు.
ప్రత్యేక సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తనకు ఫ్రొఫెసర్ జయశంకర్ తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం ఇద్దరు వేరు వేరుగా పోరాడటం దేనికి? కలిసి పోరాడండి అని జయశంకర్ పిలుపు మేరకు నా పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేశాను. కానీ నన్ను టీఆర్ ఎస్ పార్టీ నుండి అర్ధరాత్రి సస్పెండ్ చేశారు. నన్ను పార్టీనుండి ఎందుకు సస్పెండ్ చేసారో ఇప్పటికీ తెలియదు. ప్రజలు గమనిస్తున్నారు` అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే తనపై హత్యా యత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే తనకు అభిమానమని అందుకే తన పార్టీ అయిన ఏఐఏడీఎంకేకి సపోర్ట్ చేసినట్లు తెలిపారు. అయితే తన మద్దతును జీర్ణించుకోలేని డీఎంకే పార్టీ నన్ను చంపాలని చూసింది.` అని పేర్కొన్నారు.