ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తాజాగా జాతీయ రాజకీయాలపై కన్నేసారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిఒడి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనేది కేవలం ఎన్డీయే సర్కార్ వ్యతిరేక ఓటును చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని, కెసిఆర్ ఫ్రంట్ ఓ కుట్ర అని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌడ మాట్లాడుతూ కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక భారత ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశానికే చాలా కీలమని కావునా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.