తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై మరోసారి కాంగ్రెస్ నేత విజయశాంతి(రాములమ్మ) తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అరాచకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను తెలంగాణ రాష్ట్రసమితిలో విలీనం చేశారని కెసిఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే యథా రాజా, తథా ప్రజ అన్నట్లుందని వ్యంగ్యాస్త్రం విసిరారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నవారిని తెలంగాణ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దారుణాలని ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఓపక్క వణికిపోతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మర్గాపు అరాచకాను ఎవరూ సహించరని విజయశాంతి హెచ్చరించారు.