హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సునీల్ త్వరలో కమెడియన్ గా తెరపై అలరించనున్నాడు. కమెడియన్ గా కెరియర్ ను మొదలుపెట్టిన సునీల్ అందాల రాముడితో హీరో అయ్యాడు. అప్పటి నుంచి హీరోగా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరించాడు. అయితే గత కొద్దికాలంగా సునీల్ హిట్ లేక అసహనానికి గురై మళ్లీ కమెడియన్ యాక్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సునీల్ మళ్లీ క్యారెక్టర్ చేయబోతున్నాడు.దిల్ రాజు చాలా ఆసక్తితో నిర్మించబోతున్న శ్రీనివాస కల్యాణంలో కూడా స్పెషల్ క్యారక్టర్ చేయనున్నాడు.
దీనికి కొనసాగింపుగా మరి కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఓవైపు కమెడియన్ గా చేస్తూనే మరోవైపు హీరోగా చేస్తానని చెబుతున్నాడు సునీల్