ప్రధానితో సీఎం చర్చించిన వివరాలివే?

Update: 2018-08-25 14:40 GMT

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలు, నూతన జోన్లకు ఆమోదం విభజన హామీలు, అలాగే కేంద్రం నుంచి రావలసిన గ్రాంటులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా  ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. అలాగే రాష్ట్రంలో జోన్ల వ్యవస్థపై చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు, రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయింపు, ఐఐఐటీ, ఐఐఎం మంజూరు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలు సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.  

Similar News