నోటీసులు, అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమన్నారంటే..

Update: 2018-09-17 04:11 GMT

ఇటీవల తనపై వచ్చిన కోర్టు నోటీసుల గురించి సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే తాను పోరాటం చేశానని అయన చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలోనూ తాను పోరాడానని.. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అరెస్టు వారెంట్‌ ఎందుకిస్తున్నారో అర్ధం కావడంలేదని మండిపడ్డారు. వారెంట్లతో తమకెలాంటి సంబంధం లేదన్న అమిత్‌షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రం, మహారాష్ట్రలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రశ్నించారు. డ్రామాలు ఆడాల్సిన అవసరం తనకు లేదన్నారు. బ్యాంకులు దోచిన వారిని విదేశాలకు పంపుతారని.. నీటి కష్టాలు తీర్చమంటే అరెస్టు వారెంట్లు ఇస్తారా అంటూ అమిత్ షా పై చంద్రబాబు ఓ రేంజిలో ఫైర్ అయ్యారు.

Similar News