ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వద్దనుకుంటే...నమస్కారం పెట్టాలని బీజేపీ అధిష్టానానికి సూచించారు. టీడీపీపై విమర్శల అంశాన్ని బీజేపీ అధిష్ఠానం ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. తమ పార్టీ నేతలను కంట్రోల్ చేస్తున్నానని మిత్రధర్మం కారణంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని చంద్రబాబు అన్నారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు(బీజేపీ) వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం’ అన్నారు. ఇప్పటికీ బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మా నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని సీఎం అన్నారు.