అసంతృప్తితో రగిలిపోతున్న మంత్రి గంటాను బుజ్జగించేందుకు హోం మంత్రి చిన్న రాజప్ప రాయబారం జరిపినా దిగిరాలేదు. మంత్రితో సమావేశం సందర్భంగా పార్టీలో తనకు ఎదురవుతున్న అనుభవాలను ఏకరువు పెట్టారు. తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన గంటా ... విశాఖ భూముల విషయంలో తన ప్రమేయం లేదంటూ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని చినరాజప్పను ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవన్న చినరాజప్ప ... మీడియాలో వస్తున్న సర్వేలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ బుజ్జగించారు. జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే మీడయా సమావేశం నిర్వహిస్తానంటూ గంటా చెప్పడంతో ... ఆందోళనకు గురైన చినరాజప్ప ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్న అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకు అంగీకరించిన మంత్రి గంటా సీఎం సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించారు.