కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్నుంచి నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాపులను బీసీల జాబితాలో చేర్చుతామంటూ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబునాయుడు పొందుపరిచారని గుర్తు చేశారు. దీంతో సహజంగానే ఆయనకు కాపుల మద్దతు లభించిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అయితే రిజర్వేషన్ల పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి పబ్లిసిటీ చేయించుకున్నారన్నారు. కానీ, రిజర్వేషన్ల విషయంలో నిజాయితీగా ఉన్న వైఎస్సార్ సీపీ పై టీడీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారని.. అయినా ఆయన ఎప్పుడూ చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదని గుర్తు చేశారు.