విశాఖలో చెడ్డీ గ్యాంగ్ కలకలం...

Update: 2018-10-09 08:03 GMT

ఇంతకాలం హైదరాబాద్ ను హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు విశాఖని కలవర పెడుతోంది. కొద్ది రోజులుగా హైదరాబాదీలను టెన్షన్ పెట్టిస్తున్న ఈ ముఠా విశాఖలో తిష్ట వేసినట్లు సమాచారం. అర్ధరాత్రి ఆరు చోట్ల అలజడి సృష్టించినట్లు సీసీఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ముఠా చోరీకి యత్నించారన్న వార్తలతో పోలీసులు, స్థానికులు అలర్ట్‌ అయ్యారు. 

చెడ్డీగ్యాంగ్ తిరుగుతున్నారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తరహాలోనే కొందరు నిక్కర్లు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో స్ధానికులు భయాందోళన చెందుతున్నారు. చెడ్డి, బనియన్‌ ధరించిన ముఠా ముఖం కనిపించకుండా మంకీ క్యాప్‌ వేసుకుని రాత్రిపూట నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు చెడ్డీ గ్యాంగ్‌ పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక గస్తీ బృందాలను నియమించి రాత్రిపూట పహారా  నిర్వహిస్తున్నామన్నారు. అనుమానితులు కనిపిస్తే తమకు తెలియజేయాలని  సూచిస్తున్నారు. ముఠాకు సంబంధించిన ఏ సమాచారం అందినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. 

Similar News