అందుకే ప్రజాకూటమి ఓటమిపాలైంది: సీపీఐ నేత చాడ

Update: 2018-12-23 15:06 GMT

ఇటివల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ భారీ విజయం సాధించి, ప్రజాకూటమి ఓటమి పాలైన విషయం తెలిసిందే కాగా దినిపై సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కేవలం సీట్ల సర్దుబాటులో జాప్యం కారణంగానే తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపాలైందని చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల్లో పోలైన ఓట్లకంటే కౌంటింగ్ లో వచ్చిన ఓట్ల సంఖ్యే ఎక్కువ వచ్చిందని చాడవెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కనుసన్నల్లోనే ఈసి నడించదని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజాకూటమిలో కొనసాగే విషయంపై జాతీయ నాయకత్వంలో చర్చించాల్సి ఉందని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Similar News