ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని గురువారం యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న అట్లూరి ప్రవిజ, ఆమె భర్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్లూరి ప్రవిజ అనే యువతి గతంలో విజయవాడలో నివాసం ఉంది. ఓ భూమి వివాదం కేసులో లోకాయుక్తలో కేసు వేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటోంది. అయితే అపరిచిత వ్యక్తులు తమ ఇంటికి వస్తున్నారని, మంత్రికి అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో వివరించింది. అయితే కేసు నడుస్తున్న సమయంలో రక్షణ ఇవ్వలేమని, హైదరాబాద్‌లో ఏమైన ఇబ్బంది ఉంటే 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులు ఆమెకు సూచించారు.