సీఎం రమేష్‌పై ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం: జీవీఎల్

Update: 2018-10-19 09:51 GMT

ఏపీ సీఎం చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌ అని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన .. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్‌ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్‌ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్‌ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్‌ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్‌ చేస్తారని అడిగారు.

Similar News