వైసీపీ ఎమ్మెల్యేలను తాను.. అమిత్ షాతో కలిపించినట్లుగా చేస్తున్న ప్రచారాన్ని నిరూపించాలని.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఒకవేళ అదే వాస్తవమని నిరూపిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా.. టీడీపీ నాయకులు విసిరే ఎలాంటి సవాల్ కైనా తాను సిద్ధమని.. స్పష్టం చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడేది.. టీడీపీయే అని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అబద్దాలు, అవాస్తవాల మీద బతుకుతున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.