పంచాయితీ రాజ్ రిజర్వేషన్ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాజరిగింది. హైదరాబాద్ ధర్నాచౌక్లో జరిగిన ధర్నా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీమంత్రి చిత్తరంజన్ దాస్ పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్సు తెచ్చి బీసీలను రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారని బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని.. బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.