దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు విజయం తమవైపే ఉందని భావించారు బంగ్లా అభిమానులు చివరకు భారత్ గెలుపొందడంతో ఒక్కసారిగా బంగ్లా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వారికీ కోపాన్ని తెచ్చిపెడుతోంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన బంతిని ఆడేందుకు ముందుకు వెళ్లిన లిటన్ దాస్ బంతి మిస్ అవ్వడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు.
దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్ కు వెళ్ళింది. దీంతో చాలాసేపు రీప్లేలో చూసినా స్పష్టంగా కనిపించలేదు. లిటన్ కాలి వేళ్లు లైన్ వెనకభాగంలో ఉన్నట్టు సరిగా కనిపించకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా నిర్ణయించాడు. ఆ సమయంలో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడంపై బంగ్లా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అతడు అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.