ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిచెందింది. దాంతో ఆసీస్ బోణి కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ కు 174 పరుగుల లక్షాన్ని విధించారు యంపైర్లు. ఆసీస్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(4), ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచారు. దినేశ్ కార్తీక్ (30), రిషభ్ పంత్ (20) పరుగులు చేశారు. మరో 4 పరుగులు చేస్తే విజయం ఖాయం అనుకున్న తరుణంలో టీమిండియా ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఇక కీలక వికెట్లు తీసిన ఆడమ్ జంపా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.