కేవలం పురుషులే కాక మహిళా ఆటగాళ్లు సైతం క్రికెట్లో సంచలనాలు సృష్టింస్తున్నారు. టీ20 ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీని మరోసారి ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుచుకుంది. ఆంటిగ్వాలో ఇంగ్లాండ్‌ట్ తో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది ఆసీస్. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డానియెల్ వైట్(45), కెప్టెన్ నైట్(25) ఇద్దరే రెండంకెల స్కోరు సాధించారు. ఇక మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
కాగా ఆసీస్ బౌలర్లలో గార్డెనర్ 3, వారెహమ్ 2, మెఘాన్ 2 వికెట్లు దక్కాయి. తదుపరి 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు సునాయాసంగా టార్గెట్ ను చెందించింది. 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణులు గార్డెనర్(33), లానింగ్(28), హీలీ(22) రాణించారు. పైనల్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ ఆసాంతం రాణించిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇదిలావుంటే మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడం ఇది నాలుగోసారి.