ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా పెద్ద‌వారు : అశోక్ గజపతి రాజు

Update: 2018-03-25 08:13 GMT

జనసేన అధినేత, సినీహీరో పవన్‌ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ టీడీపీ ఎంపీ గజపతిరాజు అన్నారు.
గత ఏడాది మే నెలలో టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ఓ మీడియా ప్రతినిధి తనను అడిగిన ప్రశ్నకు సమాధానంగా..."ఆయనెవరో నాకు ఐడియా లేదు...అందరూ అంటున్నారు...ఎవరో సినిమావాడట...నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను"... అని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది
 కానీ ప‌రిస్థితులు మారాయ్ . తొలిసారిగా త‌న కేంద్ర‌ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత జిల్లా విజ‌య‌న‌గ‌రం విచ్చేసిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు  తెలుగుదేశం ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డిదంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ విషయం సాక్ష్యాధారాల‌తో నిరూపించాల‌ని అన్నారు.  అశోక్ గజపతి రాజు...మరో ప్రశ్నకు సమాధానంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా పెద్ద‌వార‌ని, ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలొయింగ్ త‌న‌కు లేద‌ని...తాను ఓ సామాన్య కార్య‌క‌ర్త‌న‌ని అనడం విశేషం.
ఈ సంద‌ర్భంగా ఏపి కు ప్ర‌త్యేక హోదా సాధించేందుకు చేప‌ట్టిన ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేస్తామ‌ని స్ప‌ష్టంచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వున్న స‌మ‌స్య‌ల‌ప‌ట్ల కేంద్రం ఏమాత్రం స్పందించ‌డం లేద‌న్నారు. బీజేపీ భాద్య‌త‌ క‌లిగిన ప్ర‌భుత్వంలాగా క‌నిపించ‌డం లేద‌న్నారు. తెలుగువారికి క‌ష్ట‌ప‌డే త‌త్వం, త్యాగం చేసే గుణం వుంద‌ని, తెలుగువారిని ఇబ్బందికి గురిచేస్తే వారి ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌న్నారు. ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేదిలేద‌ని అశోక్ గజపతి రాజు పున‌రుద్ఘాటించారు. 
పవన్ కళ్యాణ్ పై ఎప్పటి లాగానే వ్యంగ వ్యాఖ్యానాలు చేస్తారని భావించిన విలేకరులు...అశోక్ గజపతి రాజు ఒక్కసారిగా మాట మార్చడంతో షాక్ తిన్నారు. అప్పుడేమో అసలు పవన్ కళ్యాణెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన ఈ టీడీపి సీనియర్ ఇప్పుడు ఇలా మాట మార్చడం వెనుక కారణం ఏమైఉంటుందనేది మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. ఎంతైనా రాజకీయ నాయకుడు కాబట్టి...ఇప్పుడు అధికార దశ పూర్తయి తిరిగి ఎన్నికలకు సంసిద్దమవ్వాల్సిన సమయం దగ్గర పడుతోంది కాబట్టి...రాజకీయ...సామాజిక..ఓటు బ్యాంకు సమీకరణాలు ఆలోచించి...తన మాట తీరు మార్చుకోని ఉండొచ్చని...అలా ఒక కంక్లూజన్ వచ్చి స్థిమితపడ్డారట

Similar News