డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ గా అలరించిన హీరో విజయ్ దేవర కొండ తన దైన స్టైల్లో పోలీసులకు సారీ చెప్పాడు. అర్జున్ రెడ్డిసినిమాను అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో స్పోర్ట్స్ డ్రెస్ లో ఉన్న అర్జున్ రెడ్డి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తుంటాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూడండి అంటూ అర్జున్ రెడ్డి సినిమాలోని బైక్ సీన్ ఫోటో నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి చెందిన సోషల్ మీడియా టీం కు చెందిన అడ్మీన్ హెచ్ తెగ హడావిడి చేస్తుంది. అర్జున్ రెడ్డి సినిమానులో ని సేమ్ బైక్ సీన్ ట్రోల్ చేస్తూ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అనేది సారాంశం.
దేశంలో ప్రతి అరసెకనకొక ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాహనం నడిపేవారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు అయితే హెల్మెట్ ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే అర్జున్ రెడ్డి పోస్టర్‌లో విజయ్ దేవరకొండ హెల్మెట్ ధరించకుండా ఉన్న ఫోటోను, గ్రాఫిక్స్ సహాయంతో అదే ఫోటోకు హెల్మెట్ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల్లో ఏది సరైంది, ఏది తప్పు అనేది కూడా టిక్ పెట్టి ఓ ఫోటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్విట్ చేశారు. ఈ ట్విట్ సోషల్ మీడియాలో చక్కెర్లుకొడుతుంది.ఇక విజయ్ దేవర కొండ ఈ ట్వీట్ పై స్పందించాడు. ‘‘సారీ మామా.. ఈసారి ‘పక్కా’..’’ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేయడం విశేషం.